అక్షరటుడే, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీకి ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు ఇవ్వాలని మున్సిపల్ ఛైర్మన్ ఇందుప్రియ ఎంపీ సురేశ్ షెట్కార్ ను కోరారు. శనివారం జరిగిన దిశ మీటింగులో ఛైర్మన్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి ఒక జేసీబీ అవసరం ఉందని, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ల కొనుగోలు కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఎంపీని కోరారు. అలాగే స్టేడియంలో రన్నింగ్ ట్రాక్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని క్రీడాకారులు చెబుతున్నారని, దానిపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఎంపీ స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రపోజల్స్ తీసుకుంటున్నారని, దాని ద్వారా నిధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.