అక్షరటుడే, బాన్సువాడ: ఇటీవల కురిసిన వర్షాలకు బాన్సువాడ పట్టణంలోని పాత మున్సిపల్ రోడ్డులో భారీ గుంతలు ఏర్పడ్డాయి. బుధవారం మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజు గుంతలు పూడ్చి వేయించారు. పట్టణంలో పలుచోట్ల ఏర్పడిన గుంతలను పూడ్చి వేయిస్తున్నట్లు ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ఎజాజ్, హకీమ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.