అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలావత్ పూర్ణను విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని అన్నసాగర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో తన సొంత డబ్బులతో విద్యార్థులకు బూట్లు, సాక్స్‌లు అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి, కిరణ్, మాజీ జడ్పీటీసీ సామెల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.