అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో కొన్నేళ్లుగా నెలకొన్న విద్యుత్ లోఓల్టేజీ సమస్యను మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిష్కరించారు. హౌసింగ్ బోర్డు, గూడెం, నీలకంఠేశ్వర కాలనీలో 100 కేవీ ట్రాన్స్ ఫార్మర్ శనివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కౌన్సిలర్ నీలకంఠం, కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్, వసీం, సుమేర్ , గాదె తిరుపతి, పోచయ్య, ఫోర్ మన్ గంగాధర్, లైన్ మన్ శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.