అక్షరటుడే, కామారెడ్డి టౌన్: పట్టణ ప్రజలు అధైర్య పడద్దని, అందరికీ అండగా ఉంటామని మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని కాకతీయ నగర్‌లో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడ కూలి పక్కనే ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఆయనతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, పట్టణ కౌన్సిలర్లు తయబా సుల్తానా సలీం, చాట్ల వంశీకృష్ణ పాల్గొన్నారు.