అక్షరటుడే, కామారెడ్డిటౌన్: పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇందుప్రియ తెలిపారు. గురువారం పట్టణంలోని 4, 5, 21 వార్డుల్లో పర్యటించారు. రోడ్లు, మురికికాల్వలను పరిశీలించి.. పలుచోట్ల శుభ్రం చేయించారు. పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే గొల్లవాడలోని బుర్ర మత్తడి కాలువను పరిశీలించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ తాటి ప్రసాద్, లావణ్య, జహీరా బేగం, యామిన్, పాత శివకృష్ణమూర్తి, మమత, సాయిబాబా ఉన్నారు.