అక్షరటుడే, కామారెడ్డి టౌన్: యువత చేతిలో భవిష్యత్తు దాగి ఉందని మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా సూర్య ఆరోగ్య సంస్థ, ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సాందీపని డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. యువత లక్ష్యసాధనకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. దేశరక్షణ, సమాజ శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ కోసం యువత పాటుపడాలన్నారు. సమాజంలో సేవ గుణాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు.