అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: నగరవ్యాప్తంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిల లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ​ కమిషనర్​ దిలీప్​కుమార్​​ అధికారులను ఆదేశించారు. శనివారం రెవెన్యూ అధికారులతో​ సమీక్ష నిర్వహించారు. ఆయా బృందాలకు ఇచ్చిన టార్గెట్లను త్వరగా పూర్తి చేయాలని, సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు.