అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ మకరంద్ పరిశీలించారు. 50వ డివిజన్‌లో కమిటీహాల్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. కమిటీహాల్ నిర్మాణం పూర్తయ్యేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. 35వ డివిజన్‌లో కార్పొరేటర్ ఎర్రం సుధీర్ ఆధ్వర్యంలో రోడ్లు, డ్రెయినేజీలను పరిశీలించారు. కార్యక్రమంలో కొర్పొరేటర్ బట్టు రాఘవేందర్, ఏఈ ఇనాయత్ కరీం, సానిటరీ ఇన్‌స్పెక్టర్ పావని, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.