అక్షరటుడే, ఆర్మూర్ : విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఆర్మూర్ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది, బాత్రూంలు,తరగతి గదులు పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కిటికీలు బాత్రూం డోర్స్ రిపేరు చేయించుకోవాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ పూర్ణమౌళి ఉన్నారు.