అక్షరటుడే, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలో ఈ నెల 21 నుంచి 24 వరకు వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వార్డు సభలో ఉంచుతామన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు అప్లై చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబర్లు, కులం, అడ్రస్, ఫోన్ నెంబర్‌తో కూడిన వివరాలు ఇవ్వాలని కోరారు.