అక్షరటుడే, ఆర్మూర్: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు. మంగళవారం పెర్కిట్‌లోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల హాజరు రిజిస్టర్, వారికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. ఆయన వెంట టీచర్లు ఉన్నారు.