అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించని హోటళ్లకు జరిమానా విధించారు. పాడైపోయిన పదార్థాలతో వంటలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.