అక్షరటుడే, వెబ్‌డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదన్నారు. వీరి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదారంగ వ్యవహరిస్తున్నారని.. తానైతే వారిని ఎప్పుడో జైలుకు పంపేవాడినని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం లేదని పేర్కొన్నారు.