Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఒకరు హత్యకు గురయ్యారు. మృతుడు స్థానికంగా నివాసం ఉండే జమీల్ గా పోలీసులు గుర్తించారు. రోటీ దుకాణం వద్ద జరిగిన గొడవతో జలీల్ ఖాన్, సోను మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సోను ఓ ఆయుధంతో దాడి చేయగా ఘటన స్థలంలోనే జలీల్ మృతి చెందాడు. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేవలం ఈ గొడవ వల్లే హత్య జరిగిందా? లేక ఇతర కారణాలు ఉండి ఉంటాయా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Advertisement