అక్షరటుడే, నిజాంసాగర్‌: మహిళను దారుణంగా హతమార్చిన ఘటన పిట్లం మండలంలో చోటు చేసుకుంది. చిన్నకొడప్‌గల్‌ గ్రామానికి చెందిన గొరిగె సత్తవ్వ(56) గురువారం సాయంత్రం హత్యకు గురైంది. ఎస్సై రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే కుటుంబీకులే ఆమెను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.