అక్షరటుడే, వెబ్డెస్క్: అర్ధరాత్రి దుకాణాలు తెరవడానికి అనుమతించాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్, నాయకులు కోరారు. ఈ మేరకు ఇన్చార్జి సీపీ సింధుశర్మ, అదనపు డీసీపీ బస్వారెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13, 14 తేదీల్లో షబ్-ఎ-బరాత్, రంజాన్ మాసం సందర్భంగా అహ్మదీ బజార్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఖిల్లా రోడ్, బోధన్ చౌక్ ప్రాంతాల్లో అర్ధరాత్రి దుకాణాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు. అలాగే రంజాన్ మాసంలో నగరంలోని వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ చలాన్లు మినహాయించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మసీదుల వద్ద పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.