ఉధృతంగా ప్రవహిస్తున్న ముత్యాలమ్మ వాగు

0

అక్షరటుడే, ఆర్మూర్: జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేల్పూర్ మండలంలోని ముత్యాలమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అంక్సాపూర్ – పోచంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు గ్రామాల మధ్య ఉన్న లోలెవెల్ వంతెన పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.