అక్షరటుడే, ఎల్లారెడ్డి: అంతర్జాతీయ మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దని నలంద కళాశాల ప్రిన్సిపాల్ సంగ్రామ్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని నలంద జూనియర్, డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల భాషను నేర్చుకోవాలి కానీ, మన మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయవద్దని విద్యార్థులకు సూచించారు. మాతృభాష తల్లితో సమానమన్నారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల విద్య సంస్థల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.