అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 99 మంది కార్యదర్శులు అనుమతులు లేకుండా రెండు నెలల నుంచి 11 నెలల వరకు విధులకు గైర్హాజరయ్యారు. ఇటీవల వారు తిరిగి విధుల్లో చేరడానికి కలెక్టర్‌ను కలిశారు. దీంతో ఆమె వారి సర్వీస్ బ్రేక్ చేస్తూ ఉద్యోగంలో చేరడానికి అనుమతిచ్చారు. వారి పాత స్థానాల్లో కాకుండా ఇతర చోట్ల పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టర్ ఇటీవల గుర్రంపోడు ప్రభుత్వ ఆస్పత్రిలో విధులకు హాజరు కాని సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించిన విషయం తెలిసిందే.