అక్షరటుడే, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో ఎస్పీ కవితపై చర్యలు తీసుకుంది. సమగ్ర విచారణ తర్వాత కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. రేషన్, గుట్కా మాఫియా నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు కవితపై ఆరోపణలున్నాయి. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం కవిత షాడో టీమ్‌పై విచారణ కొనసాగుతోంది.