అక్షరటుడే, వెబ్డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇతరులతో దయతో ఉండాలని చెబుతూ ఈ భామ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుందని, తాను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను అంటోంది. ప్రజలు కూడా ఒకరిపై ఒకరు దయతో మెలగాలని సూచిస్తోంది.