అక్షరటుడే, బాన్సువాడ: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఈనెల 10న ఉన్నందున ప్రతి ఒక్క చిన్నారికి నులి పురుగుల నివారణ మాత్రలు వేయాలని వైద్యులు కీర్తి, సమిహుల్లా అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో నులి పురుగుల నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మండల స్థాయి అధికారులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్​వాడీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంతో పాటు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో సీడీపీవో సౌభాగ్య, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.