అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం ఎన్డీఏ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా ఎన్డీఏ దీటుగా ఎదుర్కొంటుందన్నారు. అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ అయినా బెంగాల్ అయినా ఎక్కడా తగ్గేది లేదని వ్యాఖ్యానించారు.