అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని ఎన్సీఎస్ఎఫ్, నిజాంషుగర్ ఫ్యాక్టరీలను తెరవకుంటే భవిష్యత్తులో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నాచౌక్లో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీలను తెరిపించాలన్నారు. రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ రంగాలకు తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో రైతు నాయకులు నాగయ్య, సాయిరెడ్డి, సాయిలు, తదితరులున్నారు.