అక్షరటుడే, కామారెడ్డి అర్బన్: కామారెడ్డి డీఎస్పీగా డి.నాగేశ్వర్ రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ఎస్సైలు, సీఐలు మర్యాదపూర్వకంగా కలిశారు. సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. నాగేశ్వర్ రావు గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఐగా పని చేశారు.