US Green Card | గ్రీన్ కార్డుపై భారతీయ అమెరికన్లలో కొత్త టెన్షన్.. సడెన్‌గా రద్దయితే ఎలా?

US Green Card | గ్రీన్ కార్డుపై భారతీయ అమెరికన్లలో కొత్త టెన్షన్.. సడెన్‌గా రద్దయితే ఎలా?
US Green Card | గ్రీన్ కార్డుపై భారతీయ అమెరికన్లలో కొత్త టెన్షన్.. సడెన్‌గా రద్దయితే ఎలా?
Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: US Green Card | గ్రీన్ కార్డు అంటే తెలుసు కదా. భారతదేశానికి చెందిన వాళ్లు వేరే దేశం వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటే ఆ దేశం వాళ్లకు గ్రీన్ కార్డును ఇస్తుంది. గ్రీన్ కార్డు ఉంటే ఇక వాళ్లు ఆ దేశ పౌరులు అవుతారు కానీ.. భారతీయులు కారు. అలా యూఎస్ లో శాశ్వత పౌరసత్వం పొందేందుకు ఆ ప్రభుత్వం గ్రీన్ కార్డును అందిస్తుంది. కానీ.. ఆ గ్రీన్ కార్డుపై తాజాగా ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో యూఎస్ లో ఉంటున్న ఇతర దేశాలకు చెందిన వాళ్లలో టెన్షన్ స్టార్ట్ అయింది. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఏమన్నారంటే.. ప్రస్తుతం విదేశీయులకు ఇచ్చిన గ్రీన్ కార్డులను ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉందని, ఆ అధికారం ప్రభుత్వానికి ఉందని జేడీ వాన్స్ అనడంతో యూఎస్ లో ఉన్న విదేశీయుల్లో కొత్త గుబులు స్టార్ట్ అయింది.
అక్రమంగా యూఎస్ లోకి వచ్చి గ్రీన్ కార్డులు పొందిన వాళ్లే కాదు, ఉద్యోగం రిత్యా, ఇతర పనుల రిత్యా యూఎస్ వచ్చి అక్కడే సెటిల్ అయి గ్రీన్ కార్డులు పొందిన వారిని కూడా తిరిగి వాళ్ల దేశాలకు పంపించేస్తామని జేడీ వాన్స్ ప్రకటించారు. దీంతో యూఎస్ లో ఉన్న ఇండియన్స్ టెన్షన్ పడుతున్నారు. గ్రీన్ కార్డు ఏ క్షణమైనా, రాత్రికి రాత్రి అయినా రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ గ్రీన్ కార్డు రద్దు చేయకపోయినా, గ్రీన్ కార్డు ఉన్న వాళ్లకు కొన్ని ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
US Green Card : ఇమ్మిగ్రేషన్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి ఇబ్బందే
యూఎస్ లో ఉన్న విదేశీయులు అందరికీ నేరుగా ఇబ్బందులు రాకపోయినా, ఇమ్మిగ్రేషన్ రూల్స్ బ్రేక్ చేసినా, ఇతర ఉల్లంఘనలు చేసిన వాళ్ల గ్రీన్ కార్డులు మాత్రం రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డులు అన్నీ రద్దు చేయకపోయినా, వాటిని అయితే ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రీన్ కార్డులు ఉన్నవాళ్లు తమ దేశాలకు వెళ్లి, తిరిగి మళ్లీ యూఎస్ రావాలంటే అసలు రానిస్తారా? లేదా? అనే మరో టెన్షన్ కూడా యూఎస్ గ్రీన్ కార్డు హోల్డర్లలో స్టార్ట్ అయింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Varun Chakravarthy : భార‌త్‌కి వ‌స్తే న‌న్ను చంపేస్తామ‌ని బెదిరించారు.. యువ క్రికెటర్ సంచ‌ల‌న కామెంట్స్