అక్షరటుడే, వెబ్‌డెస్క్: పుణే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టామ్ లాథం 86, టామ్ బ్లెండెల్ 41, ఫిలిప్స్ 48 రన్స్ తో రాణించారు. భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ రెండు వికెట్లు తీశారు. భారత్ గెలవాలంటే 359 పరుగులు చేయాల్సి ఉంది.