అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. నైజీరియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ నైజర్‌’తో మోదీని సత్కరించనున్నట్లు ప్రకటించింది. మోదీ తన మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం నైజీరియలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈక్రమంలోనే ఈఅవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో విదేశీ నేతగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.