అక్షరటుడే, వెబ్ డెస్క్: మూడు నెలలకు పైగా రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ సీజన్-8లో నిఖిల్ మలియక్కల్ విజేతగా నిలిచారు. అన్ లిమిటెడ్ టర్న్‌లు, ట్విస్ట్‌లు అంటూ.. సెప్టెంబరు 1వ తేదీన ప్రారంభమైన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ టైటిల్ అందుకున్నారు. మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ ఈ ఎనిమిదవ సీజన్లో పాల్గొనగా గౌతమ్ రన్నర్ గా, నబిల్ టాప్ 3, ప్రేరణ టాప్ 4, అవినాష్ టాప్ 5గా నిలిచారు.

గ్రాండ్ ఫినాలే హైలెట్స్..

  • హౌజ్‌లోకి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మంజు వారియర్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. బిగ్ బాస్ స్టేజీ మీదకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప మాల, దుస్తుల్లో వచ్చారు. బిగ్ బాస్ స్టేజీపై నభా నటేష్.. పుష్ప 2 పీలింగ్స్, గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి పాటలకు స్టెప్పులతో అదరగొట్టింది. యూఐ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కన్నడ స్టార్ ఉపేంద్ర సైతం ఎంట్రీ ఇచ్చారు.