అక్షరటుడే, ఇందూరు: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రజావాణి నిర్వహించగా 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయా గౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఇన్ ఛార్జి డీపీవో శ్రీనివాస్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్ పాల్గొన్నారు.