అక్షరటుడే, నిజామాబాద్: అర్బన్ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నగరానికి చెందిన మరో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. పెద్దబజార్ ప్రాంతానికి చెందిన ఖుద్దుస్, గౌతంనగర్ ప్రాంతానికి చెందిన శివచరణ్ పార్టీ వీడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే షబ్బీర్ అలీతో మంతనాలు ముగిశాయి. బుధవారం హైదరాబాద్ లో వీరిరువురు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని విశ్వసనీయంగా తెలిసింది. మరి కొందరు నేతలు సైతం వీరితో పాటు హస్తం గూటికి వెళ్తున్నట్లు సమాచారం.