అక్షరటుడే, ఇందూరు: ప్రజావాణిలో అందుతున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి పలువురు ఫిర్యాదుదారులు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మొత్తం 154 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మకరందు, శిక్షణ ఐఏఎస్ సంకేత్, డీఆర్డివో సాయా గౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్ ఫిర్యాదులను స్వీకరించారు.