అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీల్స్ పరిశీలించి, సీసీ టీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కొనసాగిస్తుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులున్నారు.