అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కోసం ఎంఎస్‌పీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శుక్రవారం మెంట్రాజ్‌పల్లి వద్ద హైవేపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వెంటనే ఎంఎస్‌పీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, దేవస్వామి, కృష్ణాగౌడ్, పీవైఎల్ నాయకుడు సాయినాథ్, పీడీఎస్‌యూ నాయకుడు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.