అక్షరటుడే, ఇందూరు: తాను ఎంపీగా గెలిస్తే నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఎంపీ అరవింద్ ఐదేళ్లలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. డబ్లింగ్ పనులు ఎక్కడికక్కడే ఉన్నాయని, ఆర్మూర్ – ఆదిలాబాద్, బోధన్ – బీదర్ రైల్వే లైన్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నాయకులు కేశ వేణు, రాజేశ్, బొబ్బిలి మురళి, విపుల్ గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.