దంపతుల బలవన్మరణం

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు బలవన్మరణం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు ఇక్కడి పోలీసులకు కర్ణాటక పోలీసులు ప్రాథమిక సమాచారం అందజేశారు. మృతులు గాయత్రీ నగర్ ప్రాంతానికి చెందిన మేడవరపు రాజు(55), మేడవరపు స్వాతి(53)గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవార్ పేట్ పరిధిలోని లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.