అక్షరటుడే, ఇందూరు: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కో-ఆర్డినేటర్, జీజీ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు కీలకమన్నారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి ఘటన జరగకుండా చూడాలన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ఎలా తీసుకోవాలో అవగాహన కల్పించారు. అనంతరం పరీక్ష విధివిధానాలపై శిక్షణ ఇచ్చారు. అడిషనల్ డీసీపీ శంకర్ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.