అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) దుర్గాప్రసాద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. నూతన డీఈవో అశోక్ ఇదివరకు ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా కొనసాగారు. నిజామాబాద్ డైట్ కళాశాలలో అధ్యాపకుడిగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. గణిత శాస్త్రం, ఐఐటీ విద్యపై మంచి పట్టు ఉంది. కాగా.. దుర్గాప్రసాద్ ను మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ గా నియమించారు.