అక్షరటుడే, బాన్సువాడ: కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గైక్వాడ్ హనుమంతును నియమస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వు కావడంతో సుంకిని గ్రామానికి చెందిన హనుమంతును పదవి వరించింది. హనుమంతు కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే వైస్ చైర్మన్ గా అనిల్ కుమార్ తో పాటు 16 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.