అక్షరటుడే, ఇందూరు: కేరళ రాష్ట్రంలోని త్రిశూల్ జిల్లా కున్నంగుళంలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ 22 మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా వారిని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి గోపిరెడ్డి, ట్రెజరర్ నీతారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ కుమార్ అభినందించారు.