అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగర మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత ఆకుల సుజాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో శుక్రవారం కాంగ్రెలో చేరారు. సుజాతతో పాటు ఆమె భర్త శ్రీశైలం, పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నగర అధ్యక్షుడు కేశ వేణు, నరాల రత్నాకర్ ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. గడుగు గంగాధర్, నగేశ్ రెడ్డి, రామర్తి గోపి ఇతర నాయకులు పాల్గొన్నారు.
పార్టీలో చేరింది వీరే..
మాజీ కార్పొరేటర్లు తేజస్విని శ్రీనివాస్‌రెడ్డి, పుప్పాల విజయ బాజన్న, అంతిరెడ్డి లత దేవేందర్‌రెడ్డి, ఏమగంటి గంగామణి నరేందర్‌గౌడ్, గోపు సుగుణ లక్ష్మణ్, టి.చంద్రకళ, శ్రీహరినాయక్, నాయకులు ముత్యాల ప్రకాశ్, చిన్నంగారి గంగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మావూరి పెద్దులు, సలేందర్ బాబురావు, అపర్ణ, ఎలదండి కృష్ణ, రమేశ్, చింతకాయల రంజిత్, వీర్‌కుమార్, చింతకాయల రాకేశ్.