అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ పౌర సరఫరాల శాఖ అధికారిణి(డీఎస్ఓ)గా సి.పద్మ, జిల్లా మేనేజర్(డీఎం)గా జి.రాజేందర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ డీఎస్ఓ, డీఎంగా పనిచేసిన చంద్రప్రకాష్, జగదీశ్ పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ గా కొనసాగుతున్న సి.పద్మను నిజామాబాద్ ఇంచార్జ్ డీఎస్ఓగా నియమించారు. అలాగే మేడ్చల్ జిల్లా సివిల్ సప్లైస్ డీఎంగా కొనసాగుతున్న జి.రాజేందర్ ను నిజామాబాద్ ఇంచార్జ్ డీఎంగా నియమించారు. ఈ మేరకు ఇరువురు అధికారులు నిజామాబాద్ లో బాధ్యతలు తీసుకున్నారు.