అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నేటి ఆధునిక యుగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే ఉత్తమ విద్య ఎంతో ముఖ్యం. జాతీయస్థాయి పరీక్షల్లో రాణించాలంటే చిన్ననాటి నుంచే నాణ్యమైన విద్య అవసరం. ఇందుకు ‘ఒలంపియాడ్‌’ విద్య ఎంతో ఉపయోగపడుతుంది. నీట్‌, ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌ లాంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలంటే.. స్కూలింగ్‌ స్థాయి నుంచే మంచి పాఠశాలలో చదివితేనే సులభతరమవుతుంది. ఒలంపియాడ్‌ విద్యనభ్యసించడం వల్లే తాను నీట్‌ ఫలితాల్లో ఉతమ మార్కులు సాధించానని చెబుతున్నారు.. కాకతీయ ఒలంపియాడ్‌ విద్యార్థిని తిరుకోవెల శ్రీణి. మంగళవారం వెలువడిన నీట్‌-2024 రిజల్ట్స్‌లో నాకు 619 మార్కులు రావడం సంతోషంగా ఉందని శ్రీణి పేర్కొంది. తన విజయానికి దోహదం చేసిన అంశాలు విద్యార్థిని మాటల్లోనే..

*నా స్కూలింగ్‌ అంతా కాకతీయ ఒలంపియాడ్‌లోనే సాగింది. స్కూల్‌లో చదివే సమయంలో ప్రతి సబ్జెక్టుపై ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ ఇచ్చేవారు. విద్యాసంస్థల డైరెక్టర్‌ సీహెచ్‌ రామోజీ రావు ప్రతి విద్యార్థిపై ప్రత్యేకంగా దృష్టిసారించి బాగా ప్రోత్సహించారు.

*స్కూలింగ్‌లో ప్రవేశపెట్టిన ఒలంపియాడ్‌ విద్యతో కూడిన నిజమైన ఐఐటీ, మెడికల్‌ శిక్షణతో ప్రస్తుతం నీట్‌ ఫలితాల్లో మంచి మార్కులు సాధించగలిగాను.

*కాకతీయ ఒలంపియాడ్‌ స్కూల్‌ డైరెక్టర్‌ సీహెచ్‌.తేజస్విని విద్యా ప్రణాళికలు, శిక్షణ తీరు, విద్యార్థులపై చూపించే ప్రత్యేక శ్రద్ధ వల్ల నీట్‌లో బాగా రాణించాను. స్కూల్‌లో ప్రణాళికబద్ధంగా శిక్షణ ఇచ్చారు. వారాంతపు పరీక్షలు, ప్రతి సోమవారం డౌట్స్‌ క్లారిఫికేషన్‌ సెషన్స్‌ కూడా నిర్వహించారు. ఇవి విజయానికి ఎంతో దోహదపడ్డాయి.

*పిల్లల భవిష్తత్తు కోసం ప్రణాళికబద్ధమైన విద్య అందించే స్కూళ్లను తల్లిదండ్రులు ఎంచుకోవాలి. మా తల్లిదండ్రులు ఒలంపియాడ్‌ స్కూల్‌లో చేర్పించడంతో జాతీయస్థాయిలో ఈ అత్యుత్తమ పర్సంటైల్‌ తెచ్చుకున్నాను.

*విద్యార్థులు జాతీయస్థాయి పరీక్షలైన ఐఐటీ, మెడికల్‌ ప్రవేశ పరీక్షల్లో సక్సెస్‌ కావాలంటే స్కూల్‌ స్థాయిలోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒలంపియాడ్‌ విద్యతో కూడిన నిజమైన ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ కలిగిన శిక్షణ ఇప్పించాలి.