అక్షరటుడే, వెబ్ డెస్క్: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో శుక్రవారం ఉదయం నగరంలో చెత్త సేకరణ నిలిచిపోయింది. బంకులో ఉదయం 7 గంటల వరకు డిజిల్ పోయడం లేదని, ఫలితంగా తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని డ్రైవర్లు ఆరోపించారు. కూపన్ బుక్స్ కోసం అదనంగా డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. అనంతరం వాహనాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. వాహనాలు కదలకపోవడంతో నగరంలో ఉదయం నుంచి చెత్త సేకరణ నిలిచిపోయింది. ఫలితంగా నగర ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి చెత్త సేకరణ జరగకపోయినా.. కమిషనర్ గానీ మేయర్ గానీ పట్టించుకోకపోవడం గమనార్హం.