అక్షరటుడే, బోధన్: పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్ లో శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి జరిపారు. పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.24 వేల నగదు సీజ్ చేసి బోధన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. కాయిన్స్ రూపంలో ఇక్కడ పేకాట నడుస్తున్నట్లు ప్రచారంలో ఉంది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి జరిపి పలువురిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.