అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన అర్సపల్లి రైల్వేగేట్​ వద్ద చోటు చేసుకుంది. నిజామాబాద్​ రైల్వేస్టేషన్​ మేనేజర్​ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​–జానకంపేట్​ రైల్వేస్టేషన్​ మధ్య అర్సపల్లి వద్ద ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జీజీహెచ్​ మార్చురీకి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలకు నిజామాబాద్​ రైల్వే పోలీస్​ 8712658591 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.