అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ రీజియన్ పరిధిలో శుక్రవారం డయల్ యువర్ ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందన్నారు. కావున ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఏవైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.