అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ మూడో టౌన్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి జరిపారు. సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మూడో టౌన్ పోలీసులు గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఓ విటుడుతో పాటు మరో నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు. ఇద్దరు విటులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే పట్టుబడిన వ్యక్తి ప్రజా సంఘాల నేతగా సమాచారం. గతంలో కమ్యూనిస్టు నాయకుడిగా కొనసాగిన ఆయన ప్రస్తుతం బీఎల్ టీయూ రాష్ట్ర నేతగా ఉన్నారు. అసాంఘిక కార్యకలాపై పోరాడాల్సిన ప్రజా సంఘాల నేత వ్యభిచారం కేసులో చిక్కడం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది.