అక్షరటుడే, జుక్కల్: ఆదిలాబాద్-పటాన్చెరు రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే పనులు చేపట్టారు. 12 ఏళ్ల కిందట సర్వే పూర్తి చేసి సిమెంట్ స్తంభాలు పాతినప్పటికీ.. అప్పటినుంచి ఎలాంటి పురోగతి లేదు. తిరిగి అదే మార్గంలో కొన్ని రోజులుగా సిబ్బంది సర్వే నిర్వహించి గుర్తులు ఏర్పాటు చేస్తున్నారు. నిజాంసాగర్ మండలం సరిహద్దులో గల సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో జాతీయ రహదారి 161 నంబర్‌పై మహాదేవ్ పల్లి, మాసానిపల్లి, దేవునిపల్లి నిజాంపేట మీదుగా రైల్వే లైన్ వేయనున్నారు. అదిలాబాద్ నుంచి పటాన్చెరు 317 కిలోమీటర్లు పొడవున రైల్వేbలైన్ ఏర్పాటుకు 5,700 కోట్ల రూపాయలు అప్పట్లో దక్షిణ మధ్య రైల్వే మంజూరు చేసింది. ఇందులో భాగంగా రెండో విడత సర్వేను ప్రారంభించారు. నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటాన్చెరు వరకు రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే కొనసాగిస్తున్నారు.